27న శ్రీశైలం ఆలయం మూసివేత

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని ఈ నెల 27వ తేదీ మూసివేస్తున్నట్లు ప్రకటించారు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎ.శ్రీరామచంద్రమూర్తి. చంద్ర గ్రహణం కారణంగా ఆరోజు మూసివేస్తున్నట్లు తెలిపారు. గ్రహణం రోజు తెల్లవారుజామున 3.30 గంటలకే మంగళ వాయిద్యాలు, 4 గంటలకు సుప్రభాత సేవ, 5 గంటలకు మంగళ హారతులు ఉంటాయని తెలిపారు. ఉదయం 5.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు భక్తులకు సర్వదర్శనం, నిత్య అభిషేకాలు ఉంటాయన్నారు.

27వ తేదీ మధ్యాహ్నం 2గంటల నుంచి భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంతో పాటు ఉపాలయాలను మూసివేయనున్నట్లు తెలిపారు శ్రీరామచంద్రమూర్తి. 28వ తేదీ తెల్లవారుజామున శుద్ధి కార్యక్రమం ఉంటుందని.. ఆ తర్వాత భక్తులను దర్శనం ఉంటుందన్నారు.

Posted in Uncategorized

Latest Updates