27న TRS ప్లీనరీ

trs-Plenaryఆవిర్భావ వేడులకు సిద్ధమవుతోంది TRS. ఈ నెల 27న ప్లీనరీ, భారీ బహిరంగసభ జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పార్టీ నేతలు. నాలుగేళ్లుగా సర్కార్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించడంతో పాటు సార్వత్రిక ఎన్నికల వ్యూహాన్ని ఇందులో ఖరారు చేయనున్నట్లు  తెలుస్తోంది. కొత్త పథకం కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

టీఆర్ఎస్ పార్టీ ఏర్ప డి ఈ నెల 27 కు 17 ఏళ్ళు పూర్తి అవుతోంది. 2001 ఏప్రిల్ 27 న జలదృష్యంలో టీఆర్ఎస్ ఆవిర్భవించింది. అప్ప టి నుంచి సుదీర్ఘ ఉద్యమం చేసిన గులాబీ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అధికారంలోకి వచ్చింది. ఇప్పటికీ నాలుగేళ్ళు పూర్తి కావొస్తోంది. సార్వ త్రిక ఎన్నికల ముందు జరుగుతున్న ప్లీనరీ కావడంతో ప్రాధాన్యత ఏర్పడింది. సర్కారు చేసిన పనులను జనాలకు చెప్పడంతో పాటు ఎన్నికలకు సంబంధించిన రాజకీయ వ్యూహాన్ని ప్లీనరీలో ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈసందర్భంగా భారీ బహిరంగ నిర్వహించాలని టీఆర్ఎస్ భావిస్తోంది.

గత ప్లీనరీ సమావేశాలు హైదరాబాద్ శివారు కొంపల్లిలో, బహిరంగసభ వరంగల్ లో జరిగింది. ఈసారి ప్లీనరీ, బహిరంగ సభను హైదరాబాద్ కు దగ్గరల్లోనే  జరపాలని భావిస్తున్నారు. ఇబ్రహీం పట్నం లేదంటే  మేడ్చల్ ఏరియాలోని ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో  ప్లీనరీ, బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 24న పార్టీ ప్రజా ప్రతినిధులతో ప్లీనరీ, 27న బహిరంగ సభ జరగనుంది. 29న 5 లక్షలమంది యాదవులతో భారీ బహిరంగసభ నిర్వహించాలన్న ఆలోచనలో ఉంది టీఆర్ఎస్ నాయకత్వం. అయితే ప్లీనరీకి ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఈ సభను వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆవిర్భావ దినోత్సవం సందర్భరంగా జరిగే బహిరంగసభకు 25 లక్షల మందిని తరలించాలని భావిస్తున్నారు TRS నేతలు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు థర్డ్ ఫ్రంట్ ఏర్పాట్లలో ఉన్న కేసీఆర్  ఈ సభకు ఇతర రాష్ట్రాల నేతలను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. నాలుగేళ్లుగా చేసిన అభివృద్ధిని సభ ద్వారా ప్రజలకు వివరించనున్నారు.

బహిరంగ సభ వేదిక పై కేసీఆర్ కొత్త పథకం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. గతేడాది పార్టీ ఆవిర్బావ సభలో రైతులకు పెట్టుబడి పథకాన్ని ప్రకటించారు సీఎం. ఈఏడాది జూన్ నుంచి ఈ పథకం అమలు కాబోతోంది. ఈసారి సభలో నిరుద్యోగభృతి  ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Posted in Uncategorized

Latest Updates