కరోనా వైరస్ పై వదంతులు.. నాటుసారా తాగి 27మంది దుర్మరణం

కరోనా వైరస్ పై  సోషల్ మీడియాలో వస్తున్న వదంతుల్ని నమ్మి 27మంది ప్రాణాలు పోగొట్టున్నారు.

ఇరాన్ లో పెరుగుతున్న కరోనా బాధితులు

చైనా తరువాత కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న దేశం ఇరాన్. ఇరాన్ ఆరోగ్య సంస్థ చెప్పిన వివరాల ప్రకారం  7,161మందికి వైరస్  సోకగా అందులో 2394మందికి వైరస్ తగ్గినట్లు ప్రకటించింది .237మంది మృత్యువాత పడినట్లు తెలిపిన ఆరోగ్య సంస్థ..సోమవారం ఒక్కరోజే సుమారు 43మంది మరణించినట్లు వెల్లడించింది.

కరోనా వైరస్ పై వదంతులు ప్రచారం

ఇరాన్ లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో దాని భారిన పడకుండా ఉండేందుకు సోషల్ మీడియాలో వస్తున్న వదంతుల్ని నమ్మిన అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఆ దేశానికి చెందిన కొన్ని సోషల్ మీడియా నెట్ వర్క్ లలో గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ పై  అసత్య ప్రచారం జరుగుతోంది.  నాటు సారా తాగితే కరోనా నుంచి భయటపడొచ్చన్న వార్తలు సర్క్యులేట్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ దేశ వ్యాప్తంగా నాటు సారా తాగి 217మంది ఆస్పత్రి పాలయ్యారు. అందులో 27మంది మృతి చెందారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆ దేశ ఆరోగ్యం సంస్థలు ప్రకటించాయి. ప్రస్తుతం నాటు సారా తో ఆస్పత్రి పాలైన బాధితులకు చికిత్స జరుగుతుందని తెలిపాయి.

మత పెద్దల అసత్య ప్రచారం  

ఆ దేశ మత పెద్దలు అసత్య ప్రచారం చేస్తున్నారు. పూజలు చేసి నాటు సారా తాగితే కరోనా వైరస్ నుంచి భయటపడవచ్చు అంటూ అమాయకుల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.

Latest Updates