ఆయన సర్పంచ్‌ అయితే దేశంలోనే రికార్డ్

పంచాయతీ ఎన్ని కల్లో ఎస్టీరిజర్వేషన్‌‌‌‌‌‌‌‌ వస్తే ఆ ఊరు దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు పొందనుంది. వినలేని ..మాటలురాని వ్యక్తి సర్పంచిగా ఎన్ని కైన ఫస్ట్‌‌‌‌‌‌‌‌ పంచాయతీగా నిలుస్తుంది. మధ్యప్రదేశ్‌ లో త్వరలో పంచాయతీ ఎన్ని కలకు నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేయనున్నారు. ఇండోర్‌‌‌‌‌‌‌‌ సిటీకి 40కిలోమీటర్ల దూరంలోని దన్సరి గ్రామం ఉంది. వెయ్యి మంది జనాభా కలిగిన ఈ గ్రామం రోస్టర్‌‌‌‌‌‌‌‌ ప్రకారం సర్పంచ్‌ పోస్ట్‌‌‌‌‌‌‌‌ ఎస్టీకి రిజర్వ్‌‌‌‌‌‌‌‌ అయ్యే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉందని అధికారులు అంటున్నారు. ఇది ఆ గ్రామంలోని ఒకే ఎస్టీ బ్రహ్మచారి యువకుడు లాలు(27)కు అదృష్టాన్నిఇంటి డోర్‌‌‌‌‌‌‌‌ వరకు తీసుకొచ్చింది. దన్సరిలో ఒకే ఒక్క ఎస్టీ కుటుంబం లాలుది. అతని చిన్నతనంలో తల్లిదండ్రులు చనిపోయారు. దీంతో ఆ ఊర్లో అతనొక్కడే ఎస్టీ వ్యక్తి. లాలు సర్పంచ్‌ పదవికి పోటీ చేయడానికి కాన్ఫిడెంట్‌‌‌‌‌‌‌‌గా ఉన్నాడని.. ఎవరి సాయం లేకుండా నేనామినేషన్లు నింపగలనని సైన్‌‌‌‌‌‌‌‌ లాంగ్వేజ్‌‌‌‌‌‌‌‌లో తనకు చెప్పినట్లు సామాజిక కార్యకర్త జ్ఞానేంద్ర పురోహిత్‌‌‌‌‌‌‌‌ మీడియాకు వెల్లడించారు.సర్పంచ్‌ గా ఎన్నికైతే గ్రామంలో రైతుల సంక్షేమం, రోడ్లు బాగుచేసేం దుకు కోసం కృషి చేస్తానన్నట్లు తెలిపారు. లాలు సర్పంచ్‌ అయితే దేశంలోని ఎంతోమంది వినలేని ,మాట్లాడలేని వారికి స్ఫూర్తి అవుతాడని… ప్రజాస్వామ్యంలో తన లాంటి వాళ్లకు వాయిస్‌‌‌‌‌‌‌‌ అవుతాడని పురోహిత్‌‌‌‌‌‌‌‌ వివరించారు.

Latest Updates