ఎలక్షన్‌ డ్యూటీలో 2,710 కంపెనీల బలగాలు

లోక్ సభ ఎన్నికల సెక్యూరిటీ కోసం 2.7లక్షల మంది పారామిలిటరీ, 20 లక్షల మంది పోలీసులు, హోం గార్డులను వినియోగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ వర్గాలు ఆదివారం చెప్పాయి. దేశంలోనే తొలిసారి ఈ ఎన్నికలకు పెద్ద ఎత్తున సెక్యూరిటీ సిబ్బందిని వినియోగిస్తున్నట్లు వెల్లడించాయి. ఎన్నికల కమిషన్ సిఫార్సు మేరకు2,710 కంపెనీల పారామిలిటరీ సిబ్బందిని కేటాయించినట్లు హోంశాఖ అధికారి ఒకరు చెప్పారు. ఒక కంపెనీలో వంద మంది సిబ్బంది ఉంటారు. కేంద్ర బలగాలతో పాటు ఆయారాష్ట్రాలకు చెందిన పోలీసులు, హోం గార్డులు కలిపి దాదాపు 20 లక్షల మందిని పోలింగ్ కేంద్రాల్లో సెక్యూరిటీ కోసం వినియోగిస్తున్నట్లు వివరించారు.

పోలింగ్ తర్వాత ఈవీఎంలను భద్ర పరిచే స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సెక్యూరిటీ కల్పిస్తున్నట్లు చెప్పారు. దేశంలో అన్ని రాష్ట్రాలపోలీసు బలగాలు 21 లక్షలు, పారామిలిటరీ సిబ్బంది 10 లక్షల వరకు ఉంటారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పోలింగ్ పూర్తయిన రాష్ట్రాల నుంచి పారామిలిటరీ సిబ్బందిని పోలింగ్ జరుగుతున్న రాష్ట్రాలకు పంపుతున్నారు. జమ్మూకాశ్మీ్ర్, వెస్ట్ బెంగాల్ లో అత్యధికంగా 41 వేలమంది సెక్యూరిటీ సిబ్బందిని భద్రత కోసం వినియోగిస్తున్నట్లు హోంశాఖ వర్గాలు చెప్పాయి. పారామిలిటరీ బలగాల్లో సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సశస్త్ర్ సీమా బల్, సీఐఎస్ఎఫ్, వివిధ రాష్ట్రాలకుచెందిన ఇండియన్ రిజర్వ్ బెటాలియన్స్ ఉన్నట్లు వెల్లడించాయి. పారామిలిటరీ సిబ్బందిని రైల్వేకోచ్ లు, ట్రక్కులు, హెలికాప్టర్లలో పోలింగ్ ప్రాంతాలకు తరలిస్తున్నట్లు హోంశాఖ అధికారిచెప్పారు. ఈ నెల 11 నుంచి ప్రారంభమైన లోక్ సభ ఎన్నికలు మే 19తో ముగుస్తాయి.

Latest Updates