విదేశాల్లో 276 మంది ఇండియన్స్‌కి కరోనా

విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్లో కొందరు కరోనా వైరస్ బారినపడినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ‘అత్యధికంగా ఇరాన్‌లో 255 మంది ఇండియన్స్‌కు ఈ వైరస్ సోకింది. ఆ తర్వాత దుబాయ్‌లో 12 మంది, ఇటలీలో ఐగురుగు, శ్రీలంక, హాంకాంగ్, కువైట్, రువాండా దేశాల్లో ఒక్క భారతీయుడి చొప్పున కరోనా బారినపడ్డారు’ అని విదేశాంగ శాఖ వెల్లడించింది. బుధవారం లోక్ సభలో ఓ ఎంపీ అడిగి ప్రశ్నకు రాతపూర్వకంగా ఈ వివరాలను తెలియజేసింది.


భారత్‌లోనూ కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతోంది. దేశంలో ఇప్పటికే 151 మందికి కరోనా సోకింది. ఇందులో 25 మంది విదేశీయులు ఉన్నారు. ముగ్గురు చికి్త్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా.. 14 మంది పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Latest Updates