ఈనెల 28న హైదరాబాద్ కు ప్రధాని మోడీ

హైదరాబాద్ : ఈ నెల 28న పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగే బీజేపీ యువమోర్చా జాతీయ సమ్మేళనం ముగింపు సభలో ప్రసంగించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మూడు రోజులపాటు (అక్టోబర్‌ 26,27,28) కొనసాగే ఈ సమ్మేళనంలో 50 వేల మంది యువమోర్చా కార్యకర్తలు పాల్గొంటారని చెప్పారు బీజేవైఎం నాయకులు. కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డజనుకు పైగా కేంద్ర మంత్రుల షెడ్యూల్‌ ఖరారైందని తెలిపారు వారు. సమ్మేళనం ముగింపు రోజున లక్ష మంది కార్యకర్తలు పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగే సభకు హాజరవుతారని వెల్లడించారు బీజేవైఎం నేతలు.

Posted in Uncategorized

Latest Updates