28 మంది IAS, IPSలకు పదోన్నతులు

iasipsఐదుగురు కార్యదర్శులకు ముఖ్య కార్యదర్శులుగా ప్రమోషన్

16 మంది ఐఏఎస్‌లకు, 12మంది ఐపీఎస్ లకు పదోన్నతులు కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు కార్యదర్శులుగా ఉన్న 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు చంద్రవదన్, బూసాని వెంకటేశ్వర్లు, సి.పార్థసారథి, శివశంకర్, వీఎన్ విష్ణుకు ముఖ్య కార్యదర్శులుగా పదోన్నతి కల్పించారు. 2004-05 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు కే నిర్మల, గౌరవ్ ఉప్పల్, ఇలంబర్తి, మాణిక్‌రాజ్, డాక్టర్ ఏ శరత్, ఎల్ శర్మన్‌కు సెలక్షన్ గ్రేడ్ అధికారులుగా, 2008-09 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు దేవసేన, సర్ఫరాజ్ అహ్మద్, ఎన్ సత్యనారాయణ, అర్విందర్‌సింగ్, ప్రశాంతికి జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ అధికారులుగా పదోన్నతులు కల్పించారు.

అలాగే రాష్టంలో పనిచేస్తున్న 2005, 2006 బ్యాచ్‌లకు చెందిన 12 మంది ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ స్కేల్‌కు పదోన్నతి కల్పించింది ప్రభుత్వం. పదోన్నతి పొందినవారిలో 2005 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌లు వీ శివకుమార్, వీబీ కమలాసన్‌రెడ్డి, ఎస్ చంద్రశేఖర్‌రెడ్డి, ఏఆర్ శ్రీనివాస్, పీ విశ్వప్రసాద్, ఎం రమేశ్, 2006 బ్యాచ్‌కు చెందిన కే రమేశ్‌నాయుడు, ఏవీ రంగనాథ్, బీ సుమతి, ఎం శ్రీనివాసులు, వీ సత్యనారాయణ, ఏ వెంకటేశ్వరరావు ఉన్నారు.

Posted in Uncategorized

Latest Updates