జార్ఘండ్ లో కొనసాగుతున్న పోలింగ్

జార్ఖండ్ లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇవాళ ఉదయం 11 గంటల వరకు 28.05 శాతం పోలింగ్ నమోదయింది.  20 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 48 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్ జంషడ్ పూర్ ఈస్ట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. జంషెడ్ పూర్ వెస్ట్ కూ ఇదే విడతలో పోలింగ్ జరుగుతోంది. జార్ఖండ్ స్పీకర్, జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు పోలింగ్ ముగియనుంది. ఉదయం నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. జార్ఖండ్ లో మొత్తం 5 దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.

Latest Updates