ఉగ్రవాదుల దాడిలో 29 మంది సైనికులు మృతి

ఉగ్రవాదులు జరిపిన దాడిలో 29 మంది సైనికులు మృతి చెందారు. ఈ దారుణ దాడి ఉత్తర మాలిలో జరిగింది. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడిలో 29 మంది సైనికులు చనిపోయినట్లు సైనికాధికారులు తెలిపారు.

‘గావోలో FAM స్థావరాలపై ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు ఈ దాడిలో 29 మంది FAM సైనికులు మరణించగా మరో ఐదుగురు గాయపడ్డారు’ అని సైన్యం తన ఫేస్‌బుక్ పేజీలో తెలిపింది. కొన్నేళ్లుగా మాలిలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. దాంతో మాలిలో అంతర మత ఉద్రిక్తతలు పెరిగాయి.

టువరెగ్ ఉగ్రవాదులు 2012లో మాలిలోని ఉత్తర భాగంలో చాలా భూభాగాలను తమ స్వాధీనం చేసుకున్నారు. అప్పటినుంచి అక్కడ ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి.

For More News..

నిర్భయ కేసు: దోషుల్లో అతను ఇంగ్లీష్ కూడా మాట్లాడగలడు

నిర్భయ దోషులకు ఉరి అమలు

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా.. 2 లక్షలు దాటిన కేసులు

Latest Updates