ఏపీలో కొత్తగా 2,997 మందికి పాజిటివ్.. 8 లక్షల 7 వేలకి చేరిన కేసులు

ఏపీలో కొత్తగా 2,997 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 67,419 శాంపిల్స్‌ను పరీక్షించడంతో 2,997 మంది కరోనా బారినపడ్డట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,07,023కి చేరింది. శ‌నివారం ఒక్కరోజే వైరస్ కారణంగా 21 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 6,587కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలో 30,680 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,585 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 7,69,576కి చేరుకుంది.

ఇక మ‌ర‌ణాల విష‌యానికి వ‌స్తే.. కొత్తగా చిత్తూరులో 5, కడపలో ముగ్గురు మృతి చెందారు. అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. నెల్లూరు, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు

Latest Updates