2జీనే ఎక్కువ ఇష్టపడుతున్నరు..

న్యూఢిల్లీ: 3జీ, 4జీ వచ్చి ఇన్నాళ్లైనా.. చాలా మంది ఇంకా 2జీ నే ఇష్టపడుతున్నారు. దీంతో కంపెనీలు కూడా కస్టమర్లను 2జీ నుంచి 4జీలోకి మారాలని బలవంతం పెట్టకుండా.. వారి అభిప్రాయాలకే ఛాయిస్ ఇస్తున్నాయి. కస్టమర్లు స్వేచ్ఛగా 2జీ నుంచి 4జీలోకి మారే విధానంపై నిర్ణయం తీసుకోవచ్చని వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌‌‌‌టెల్ పేర్కొంటున్నాయి. కస్టమర్లందరూ 4జీ కి మారితే ఎకానమిక్‌‌గా ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఈ విషయంపై మాత్రం యూజర్లను కంపెనీలు బలవంతం పెట్టడం లేదు. టెక్నాలజీలతో వాయిస్, డేటా డిమాండ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుంటున్నామని ఇంక్యుబెంట్ ఆపరేటర్లకు చెందిన ఎగ్జిక్యూటివ్‌‌లు చెప్పారు.

అఫర్డబులిటీ కారణంతో ఫీచర్ ఫోన్ యూజర్లు ఇంకా 2జీ నే వాడుతున్నారని తెలుసుకున్నారు. ఫుల్ 4జీ నెట్‌‌వర్క్ ఉన్న జియో… ఇండియాను 2జీ ఫ్రీ చేసేలా ప్రభుత్వం, రెగ్యులేటరీ పాలసీలు తీసుకురావాలని కోరుతోంది. అయితే వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌‌‌‌టెల్‌‌లు ఇంకా 2జీ పైనే ఆధారపడుతున్నాయి. వాయిస్ సర్వీసులు కూడా ఇంకా ఎక్కువగా 2జీపైనే ఉన్నాయి. 2జీ, 4జీ స్పెక్ట్రమ్‌‌లు రెండు కంపెనీల వద్ద ఉన్నా… వాటిలో లోయర్ బ్యాండ్‌‌విడ్త్​ను వాయిస్ కోసం వాడుతుండగా.. హైయర్ బ్యాండ్‌‌విడ్త్​ను డేటా కోసం వాడుతున్నారని టెల్కోలకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు.

మరిన్ని వార్తల కోసం

Latest Updates