దెబ్బకు దెబ్బ : రెండో టీ20 మనదే..

న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ 20 లో విక్టరీ కొట్టింది భారత్. 159 పరుగుల టార్గెట్ ను ఈజీగా ఛేజ్ చేసింది. 3 వికిట్లో కోల్పోయి 162 రన్స్ చేసింది భారత్. ఇండియన్ బ్యాట్స్ మెన్ లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో మెరిశాడు. శిఖర్ దావన్ 30 రన్స్ తో పరవాలేదనిపించాడు. విజయ్ శంకర్ 14 పరుగులకే ఔటయ్యాడు.

తర్వాత వచ్చిన రిషబ పంత్ దూకుడుగా ఆడాడు. ధోనితో కలిసి టీమిండియాకు విజాయన్ని అందించారు. అంతకు ముందు బ్యాటింగ్ దిగిన న్యూజిలాండ్…భారత బౌలర్ల దాటికి భారీ స్కోరు చేయలేకపోయింది. కృణాల్ పాండ్యా 3 వికెట్లతో చెలరేగాడు. ఈ విజయంతో 3 టీ20 ల సిరీస్ 1-1 తో సమంగా ఉంది.

Latest Updates