3 నిమిషాలు వెయిట్ చేయించారని : టోల్ ప్లాజా దగ్గర MLA వీరంగం

టోల్‌ గేట్ దగ్గర ఓ ఎమ్మెల్యే రెచ్చిపోయాడు. తన డ్రైవర్ తో కలసి వెహికల్ బారికేడ్‌ను విరగ్గొట్టి టోల్ ప్లాజా దగ్గర వీరంగం సృష్టించాడు. కేరళలోని త్రిసూర్ లో ఈ ఘటన జరిగింది.

కేరళ రాష్ట్రానికి చెందిన ఇండిపెండెంట్ ఎమ్మేల్యే  పీసీ జార్జ్‌ మంగళవారం(జులై-17) రాత్రి  తన కారులో రైల్వే స్టేషన్ కు బయల్దేరాడు. అయితే  కారుపై ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్‌ ను గుర్తించని పాలియకరా టోల్‌ ప్లాజా సిబ్బంది ఆయన కారును 3 నిమిషాల పాటు ఆపేశారు. దీంతో కోపోద్రిక్తుడైన జార్జ్‌… కారులో నుంచి దిగి తన డ్రైవర్ తో కలసి వెహికల్  బారికేడ్‌ ను ధ్వంసం చేశారు. టోల్‌ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన అక్కడున్న సీసీటీవీలో రికార్డు కావడంతో సోషల్‌ మీడియాలో ఈ వీడియో  వైరల్‌ అయింది.

ఈ ఘటనపై స్పందించిన జార్జ్… రైల్వే స్టేషన్ కు వెళ్లాల్సిన తొందరలో ఉన్న సమయంలో కారుపై ఉ‍న్న స్టిక్కర్‌ ను చూసి కూడా వెయిట్ చేయించారన్నారు. ఈలోపు వెనుక ఉన్న వాహనాలు సౌండ్ హారన్ కొట్టడంతో…కోపం వచ్చి  ఈ పని చేసినట్లు తెలిపారు.   అయితే  ఈ విషయమై టోల్‌ ప్లాజా సిబ్బంది నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఇంతకుముందు కూడా ఇలాంటి చర్యలతో జార్జ్‌  వార్తల్లో నిలిచారు.

Posted in Uncategorized

Latest Updates