3 రాష్ట్రాలకు ఎన్నికల ఇంఛార్జ్ లను నియమించిన బీజేపీ…తెలంగాణకు జేపీ నడ్డా

ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణ, రాజస్ధాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ముగ్గురు కేంద్రమంత్రులను ఇంఛార్జ్‌ లుగా నియమించింది. మధ్యప్రదేశ్ కు ధర్మేంద్ర ప్రధాన్‌, తెలంగాణకు జేపీ నడ్డా, రాజస్థాన్‌కు ప్రకాశ్ జవదేకర్ లను ఇంఛార్జ్ లుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నియమించినట్లు బుధవారం(అక్టోబర్-3) బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు, ప్రచారం, అభ్యర్థుల ఎంపికపై ఇంఛార్జ్ లు కసరత్తు చేయనున్నారు. త్వరలోనే ఈ ముగ్గురు ఇంఛార్జ్‌లు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.
ఇటీవల తృణముల్ కాంగ్రెస్ కి రాజీనామా చేసి…బీజేపీలో చేరిన ముకుల్ రాయ్ ని వెస్ట్ బెంగాల్..బీజేపీ ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీ కన్వీనర్ గా నియమించారు. మధ్యప్రదేశ్ లో బలమైన నేత, ఆరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న అరవింద్ మీనన్ ని వెస్ట్ బెంగాల్ కో ఇంఛార్జ్ గా నియమించారు.

Posted in Uncategorized

Latest Updates