యువతిని వేధించినందుకు 3 రోజుల జైలు శిక్ష, రూ.150 జరిమానా

హైదరాబాద్: ఓ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్షతో పాటు రూ.150 జరిమానా విధించింది కోర్టు. ఈ నెల 10 న(మంగళవారం) సాయంత్రం  నగరంలోని అలుగడ్డ బావికి చెందిన దుబ్బాక రమేష్ కుమార్(50) ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అతని ప్రవర్తనకి విసిగిపోయిన ఆ యువతి  100 కి డయల్ చేసి, అతడిని పోలీసులకు పట్టించింది.

ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చిలకల గూడ పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు. గురువారం ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు అతనికి మూడు రోజుల జైలు శిక్ష, రూ.150 జరిమానా విధించింది.

 

3-day jail term for harassing a young woman

Latest Updates