3 రోజులు రాష్ట్రానికి భారీ వర్ష సూచన

హైదరాబాద్: తెలంగాణలో రెండు రోజుల పాటు పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. అరేబియా సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడురోజులు భారీ వర్షాల కురుస్తాయని తెలిపింది. ఉరుములు, ఈదురు గాలులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. యాదాద్రి, వికారాబాద్‌, మెదక్‌, సిద్దిపేట, సంగారెడ్డి, మహబూబ్‌ నగర్‌, వనపర్తి, నాగర్‌ కర్నూలు, గద్వాల జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.

Latest Updates