బావ మరదళ్ల ప్రాణం తీసిన ఈత..

3-dead-in-bommakuru-reservior-jangam

జనగాం జిల్లా నర్మెట్ట మండలంలో దారుణం జరిగింది. ప్రమాదవశాత్తు బొమ్మకూర్ రిజర్వయార్లో పడి ముగ్గురు చనిపోయారు. సరదాగా ఈతకు వెళ్లిన ఓ యువకుడు, ఇద్దరు యువతులు నీటిలో పడి మునిగిపోయారు. మృతులను రఘనాథపల్లి మండలం మేకలగట్టు గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. చనిపోయిన వారిలో ఏళ్ల సుమలత(20) ఏళ్ల సంగీత(19) అవినాశ్(32) ఉన్నారు. ముగ్గురు చనిపోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

మృతుడు అవినాష్ హైదరాబాద్ లో పని చేస్తూ ఉంటాడు.. వేసవి సెలవులు ఉండటంతో స్వంత ఊరు అయిన జిబి తండాకు వచ్చి మరదలు అయిన సంగీత, సుమలతలతో బొమ్మకూర్ రిజర్వాయర్ సందర్శించి సెల్ఫీలు దిగుతుండాగా జారీ రిజర్వాయర్ లో పడి మృతి చెందారు. వారు ఈత కొడుతుండగా దగ్గరలో ఉన్న అవినాష్  భార్య భార్గవి వీడియో తీస్తుండగానే ఈ ఘటన జరిగింది.

Latest Updates