హాస్టల్ లో దారుణం : డిగ్రీ విద్యార్థినులకు ప్రెగ్నెన్సీ

కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ హస్టల్ లో దారుణం జరిగింది. హస్టల్ లోని ముగ్గురు విద్యార్థినులు గర్భం దాల్చినట్టు తెలుస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. విద్యార్థినుల ఆరోగ్యం బాగా లేకపోవడంతో హస్టల్ అధికారులు రిమ్స్ కు తీసుకెళ్లారు.

పరీక్షల్లో  విద్యార్థినులు గర్భం దాల్చినట్టు డాక్టర్లు చెప్పినట్లు సమాచారం. ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా హస్టల్ అధికారులు దాచిపెట్టారు. ఈ విషయం ఇప్పుడు బయటికి రావడంతో ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు విచారణ చేయిస్తున్నారు. విద్యార్థినులను అడిగి వివరాలు సేకరిస్తున్నారు.

Latest Updates