బైక్‌పై స్టంట్స్ చేయ‌బోయి.. ముగ్గురు యువ‌కులు మృతి

కర్ణాటకలో ఈ ఆదివారం విషాదం చోటుచేసుకుంది. బెంగళూరులో ఓ ముగ్గురు యువకులు బైక్‌పై స్టంట్స్‌ చేస్తూ.. ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరు విమానాశ్రయానికి వెళ్లే రహదారిలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని గోవిందపుర ప్రాంతానికి చెందిన ముగ్గురు యువ‌కులు ఆదివారం తెల్ల‌వారుజామున బైక్ ‌పై బ‌య‌ట‌కు వెళ్లారు. విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో రోడ్డుపై బైక్‌తో విన్యాసాలు చేశారు. బైక్ స్టంట్స్ చేయ‌బోయిన క్ర‌మంలో.. బైక్‌ అదుపు త‌ప్పి ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న యెలహన్క పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Latest Updates