భారత్‌లో మరో 3 కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కేసుల్లో రెండు లడాఖ్‌, మరొకటి తమిళనాడు లో నమోదైనట్టు తెలిపింది. దీంతో ఈ వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య 34కు చేరుకుంది. లడాఖ్‌కు చెందిన ఇద్దరు ఇటీవలే ఇరాన్‌కు వెళ్లారని, మరొకరు తమిళనాడుకు చెందిన వ్యక్తి  ఒమన్‌ను సందర్శించారని తెలిసింది. అయితే కోవిడ్‌ బారిన పడ్డ ఈ ముగ్గురి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్టు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల్లో ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకు 3,400 మంది మరణించారు.

Latest Updates