తమిళనాడులో మరో ఇద్దరు పోలీసులకు కరోనా

చెన్నై: లాక్​డౌన్ సమయంలో డ్యూటీ నిర్వర్తిస్తున్న పోలీసులు వైరస్ బారిన పడుతున్నారు. తమిళనాడు కోయంబత్తూర్ లో ఇప్పటికే ఆరుగురు పోలీసులు కరోనా బారిన పడగా మంగళవారం చెన్నైలో మరో ఇద్దరు కానిస్టేబుల్స్ కు వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. నుంగంబాక్కం పోలీస్ స్టేషన్ లో డ్యూటీలో ఉన్న ఇద్దరు పోలీసులకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చిందని అధికారులు వెల్లడించారు. వారిని ఐసోలేషన్ కు తరలించామని, వారి కాంటాక్టులు ట్రేస్ చేస్తున్నామని తెలిపారు. కరోనా పాజిటివ్ పేషెంట్లను కాంటాక్ట్ అవడంతోనే వీరికి వైరస్ సోకినట్లు తేలిందన్నారు. ఇప్పటికే కోయంబత్తూర్ లో ఆరుగురు పోలీస్ సిబ్బంది కరోనా బారిన పడటంతో రెండు పోలీస్ స్టేషన్లను టెంపరరీగా మూసివేశారు. సోమవారం నాటికి తమిళనాడులో 1,204పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Latest Updates