జార్ఖంఢ్​లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు నక్సల్స్ మృతి

  • మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న సీఆర్పీఎఫ్​

రాంచీ: సెక్యూరిటీ ఫోర్సెస్ తో గురువారం జార్ఖండ్‌లో జరిగిన ఎన్​కౌంటర్ లో ముగ్గురు నక్సల్స్ మృతి చెందగా, ఇద్దరిని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. పశ్చిమ సింఘ్‌భూమ్ జిల్లాలోని మన్మారు-టెబో ప్రాంతంలో జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో ఒక మహిళా నక్సల్ తో సహా ముగ్గురు చనిపోయారని, ఇద్దరు మావోయిస్టులను పట్టుకున్నామని తెలిపారు. స్పాట్ నుంచి ఏకే 47 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్​) 60 వ బెటాలియన్ పై గురువారం ఉదయం 5 గంటల సమయంలో నక్సల్స్ ఆకస్మక దాడికి పాల్పడ్డారని, సీఆర్పీఎఫ్​సిబ్బంది వారిని ధీటుగా ఎదుర్కొన్నారని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.

Latest Updates