కూలిన మూడంతస్తుల భవనం.. ముగ్గురు మృతి

గుజరాత్ లోని  అహ్మదాబాద్ పట్టణంలో విషాద సంఘటన జరిగింది. నగరంలోని అమ్రావాడి ఏరియాలో ఓ మూడంతస్తుల భవనం కూలిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న కొంతమందిని రక్షించారు. ఈ ఘటనలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Latest Updates