షోఫియాన్‌ ఎన్‌కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ఇంకా కొనసాగుతూనే ఉంది. షోఫియాన్ జిల్లా తుర్కువాంగన్ గ్రామంలో ఇవాళ(మంగళవారం,జూన్-16) జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. గ్రామంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో  రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్‌పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు మంగళవారం తెల్లవారుజామున గాలింపు చేపట్టారు.

భద్రతా దాళాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. అలర్టైన భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఎన్‌కౌంటర్ ప్రాంతం నుంచి ఏకే-47, ఇన్‌సాస్ రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. గత 10 రోజుల్లో 19 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి.

Latest Updates