ముగ్గురు టెర్రరిస్టులను మట్టుబెట్టిన సెక్యూరిటీ ఫోర్సెస్

న్యూఢిల్లీ: ముగ్గురు టెర్రరిస్టులను సెక్యూరిటీ ఫోర్సెస్ మట్టుపెట్టిన ఘటన జమ్మూ కాశ్మీర్‌‌లోని షోపియాన్‌ జిల్లాలో బుధవారం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి సుమారుగా 1.30 గంటలకు ఈ ఎన్‌కౌంటర్ మొదలైంది. సుగో అనే విలేజ్‌లో మిలిటెంట్స్‌ ఉన్నారనే సమాచారంతో అక్కడికి చేరుకున్న ఆర్మీ.. సెంట్రల్ రిజర్వ్ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌‌పీఎఫ్)తో కలసి ఈ ఆపరేషన్‌ను నిర్వహించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆదివారం నుంచి కేవలం మూడు రోజుల్లో షోపియాన్‌లో జరిగిన మూడో ఎన్‌కౌంటర్ ఇది కావడం గమనార్హం. గత రెండు ఎన్‌కౌంటర్స్‌లో సెక్యూరిటీ ఫోర్సెస్ చేతిలో 9 మంది టెర్రరిస్టులు హతమయ్యారు.

Latest Updates