పుల్వామాలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్  పుల్వామా  జిల్లాలోని త్రాల్ జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు. వారి దగ్గర నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు కశ్మీర్ జోనల్ పోలీసులు తెలిపారు. త్రాల్ లోని ఓ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో ఉగ్రవాదులు దాగినట్టు పోలీసులకు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. దీంతో నిన్న రాత్రే ఆ బిల్డింగ్ ను సరౌండ్ చేశాయి భద్రతా బలగాలు. ఈ తెల్లవారుజామున మొదలైన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు హతమార్చాయి. చనిపోయిన ఉగ్రవాదుల్లో ఉమర్ ఫయాజ్ లోన్, అదిల్ బషీర్ మీర్ లు హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు చెందినవారు కాగా… ఫైజాన్ హమీద్ భట్ జైషే మొహమ్మద్ కు చెందినవాడని పోలీసులు తెలిపారు.

Latest Updates