ఎన్ కౌంటర్ లో ముగ్గురు టెర్రరిస్టులు మృతి

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లో ముగ్గురు టెర్రరిస్టులను భద్రత బలగాలు కాల్చి చంపాయి. జమ్ముకాశ్మీర్ లోని షోపియాన్ జిల్లా మెల్ హురాలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. షోపియాన్ జిల్లాలో టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఆర్మీ, సీఆర్ఫీఎఫ్, షోషియాన్ జిల్లా పోలీసులు మంగళవారం రాత్రి గాలింపు చర్యలు చేపట్టారు. జైన పొర లో గాలింపు చేపట్టిన సెక్యూరిటీ సిబ్బంది పై టెర్రరిస్టులు కాల్పులు స్టార్ చేశారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది ఎదురు కాల్పులకు దిగారు. మంగళవారం రాత్రంతా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘనటలో ముగ్గురు టెర్రరిస్టులు చనిపోయారు.

Latest Updates