హెడ్ సెట్ పెట్టుకున్న వంటవాడు: కూరబానలో పడి మూడేళ్ల చిన్నారి మృతి

ఓ ప్రభుత్వ స్కూల్లో  విషాదం చోటు చేసుకుంది. మధ్యాహ్నం పిల్లల కోసం కూర చేస్తున్న బానలో పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందింది.

ఉత్తర్ ప్రదేశ్ మిర్జాపూర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మిర్జాపూర్ జిల్లా రాం పూర్ అటారి గ్రామ ప్రభుత్వ స్కూల్లో విద్యార్ధుల కోసం మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే  వంటవాడు హెడ్ సెట్ పెట్టుకొని పాటలు వింటూ కూర చేస్తున్నాడు.

అదే సమయంలో ఓ మూడేళ్ల చిన్నారి కూర బానలో పడింది. పాటలు వినడంలో లీనమైన వంటవాడు చిన్నారి బానలో పడిపోవడాన్ని గుర్తించలేదు. వేడికి  తాళలేక గుండెలవిసేలా ఏడుస్తున్న చిన్నారి గొంతు విన్న ఆమె అన్న కాపాడండి అంటూ  కేకలు వేశాడు. అయినా వంటవాడికి వినిపించలేదు.  అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

కేకలు వేస్తూ దగ్గరకొచ్చిన అన్న వంటవాడిని తడితే స్పృహలోకి వచ్చాడు. బానలో ఉన్న చిన్నారి బయటకి తీసిన పాఠశాల యాజమాన్యం ఆస్పత్రికి తరలించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. చిన్నారి మృతి పట్ల విచారణ చేపట్టిన జిల్లా కోర్ట్ స్కూల్ హెడ్ మాస్టర్ ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Latest Updates