ఆడుకుంటూ లిఫ్ట్ లో చిక్కుకున్న బాలుడు

3-years-child-lift-accident

హైదరాబాద్ : ఆడుకుంటూ లిఫ్ట్ లోకి వెళ్లిన మూడేళ్ల బాలుడు..మూడు గంటల పాటు లిఫ్ట్ లోనే చిక్కుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్  చందానగర్ పాపిరెడ్డి కాలనీలో బుధవారం జరిగింది. స్వగృహలో అపార్ట్‌మెంట్‌లోని బ్లాక్ నంబర్ ఈఏ2లో నివాసం ఉండే ఫనీంద్ర చారి కుమరుడు సౌర్యన్ ఆడుకుంటూ లిఫ్ట్‌ ఎక్కాడు. పై వరకు వెళ్లిన లిఫ్ట్ టెక్నికల్ ప్రాబ్లమ్ తో ఆగిపోయింది. దీంతో సౌర్యన్ అరవడంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, 108 ఉద్యోగులు శ్రమించి బాలుడిని సురక్షితంగా రక్షించడంతో బాలుడు ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు. లిఫ్ట్ గోడలు పగలగొట్టి బాలుడుని రక్షించడంతో 3 గంటల ఉత్కంఠకు తెర పడింది. బాలుడు సేఫ్ గా బయటికి రావడంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. పిల్లల పట్ల నిర్లక్ష్యంగా ఉండరాదని తెలిపారు పోలీసులు.

Latest Updates