30శాతం కంపెనీలు క్లోజ్ : రెండేళ్లుగా రూపాయి లావాదేవీలు లేవు

CLOSE COMPENIESబిజినెస్ లో ఢీలా పడుతున్న కంపెనీల లైసెన్సులను క్యాన్సిల్ చేయనుంది కేంద్రం. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా 25 నుంచి 30శాతం కంపెనీలు త్వరలో మూతబడనున్నాయి.  రెండేళ్లుగా ఎలాంటి బిజినెస్ కొనసాగించకపోవడంతో వాటిని మూసివేయించాలని చూస్తోంది కేంద్రం ప్రభుత్వం. వాటి రిజిస్ట్రేషన్లను క్యాన్సిల్ చేయాలని చూస్తోంది. డొల్ల కంపెనీలు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కంపెనీల చట్టంలోని కొన్ని నిబంధనలను ఉపయోగించి.. గత రెండేళ్లుగా లాభాలు లేని కంపెనీల రిజిస్ట్రేషన్లను క్యాన్సిల్ చేయాలని కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ భావిస్తోంది.

ఒక కంపెనీ రెండేళ్లుగా ఎలాంటి బిజినెస్ లు  చేయకుండా, ఆదాయం పొందకుండా ఉంటే ఆ కంపెనీలను డీరిజిస్టర్‌ చేసే వెసులుబాటు చట్టంలో ఉంది. దీన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అలాంటి కంపెనీలకు నోటీసులు జారీ చేస్తుంది. వాటికి 30రోజుల్లోగా కంపెనీలు స్పందించాల్సి ఉంటుంది. ఇటీవల డొల్ల కంపెనీలను గుర్తించే క్రమంలో కొన్ని కంపెనీలు గత రెండేళ్లుగా ఎలాంటి బిజినెస్  జరపలేదని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. అలాంటి కంపెనీలు దేశవ్యాప్తంగా 3 నుంచి 4 లక్షల వరకు అంటే 35శాతం ఉన్నాయట. వాటిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ వాటి రిజిస్ట్రేషన్లను క్యాన్సిల్ చేస్తే ఆ కంపెనీలన్నీ మూతబడతాయి. ఇప్పటికే 2.25 లక్షల కంపెనీలు డొల్ల కంపెనీలుగా గుర్తించిన ప్రభుత్వం వాటిని డీరిజిస్టర్‌ చేసిన విషయం తెలిసిందే.

 

 

Posted in Uncategorized

Latest Updates