పుదుచ్చేరిలో 30 కిలోల ఉచిత బియ్యం

పుదుచ్చేరి: లాక్ డౌన్ తో ఇబ్బందులు ప‌డుతున్న ప్ర‌జ‌ల‌కు ఇప్ప‌టికే ప్ర‌భుత్వాలు తోచిన విధంగా బియ్యం, పప్పు, న‌గ‌దు పంపిణీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే పుదుచ్చేరి రాష్ట్రం కీలక నిర్ణ‌యం తీసుకుంది రాష్ట్రంలోని ప‌సుపు రంగు రేష‌న్ కార్డు దారుల‌కు 30 కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చేందుకు ఆ రాష్ట్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. దీంతో రేష‌న్ షాపుల్లో బియ్యం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. అటు స‌హ‌కార శాఖ సిబ్బందికి పెండింగ్ లో ఉన్న మూడు నెల‌ల జీతాలు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం నిధులు విడుద‌ల చేసింది.

Latest Updates