చింగారికి 30 మిలియన్ డౌన్‌‌లోడ్స్

యూజర్లలో ఎక్కువ మంది 18–35 ఏళ్ల వారే

బెంగళూరు: మేడిన్ ఇండియా షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్‌ ఫామ్ ఛింగారి 30 మిలియన్‌ కు పైగా డౌన్‌ లోడ్స్‌‌ను క్రాస్ చేసింది. మూడు నెలల వ్యవధిలోనే ఈ మార్క్‌‌ను అధిగమించినట్టు సోషల్ యాప్ తెలిపింది. ఛింగారి తన ప్లాట్‌ ఫామ్‌‌పై అగ్యుమెంటెడ్ రియాల్టీ(ఏఆర్‌ ) ఫిల్టర్స్‌‌ను యాడ్ చేసింది. అదేవిధంగా కంటెంట్ క్రియేటర్లకు మరింత అత్యాధునిక ఫ్రంట్, రియల్ కెమెరా టూల్స్‌‌ను అందిస్తోంది. ఛింగారి యూజర్లలో ఎక్కువ మంది 18-35 ఏళ్ల వారేనని చెప్పింది. ఇంగ్లీష్, స్పానిష్‌ తో పాటు ఛింగారి కంటెంట్ తెలుగు, హిందీ, బంగ్లా, గుజరాత్, మరాఠి, కన్నడ, పంజాబి, మలయాళం, తమిళ్, ఒడియాలో కూడా అందుబాటులో ఉన్నట్టు పేర్కొంది. ఇండియాతో పాటు యూఏఈ, యూఎస్, కువైట్, సింగపూర్, సౌదీ అరేబియా, వియత్నాం ప్రాంతాల్లో కూడా తమకు యూజర్ బేస్‌‌ పెరుగుతున్నట్టు వెల్లడించింది.

Latest Updates