తల్లి నుంచి పిల్లలకు కరోనా : గర్భంలో, డెలివరీ సమయంలో 30% కేసులు

 ఫ్రాన్స్ లో 176 కరోనా  కేసులపై  నిర్వహించిన ఓ అధ్యయనంలో నమోదైన ఎక్కువ కరోనా కేసుల్లో 30శాతం అప్పుడే పుట్టిన పసికందులకు గర్భంలో లేదా ప్రసవం సమయంలో వ్యాపిస్తున్నట్లు సైంటిస్ట్ లు గుర్తించారు. ఎక్కువశాతం నవజాతి శిశువులకు  ప్రసవం తరువాత వైరస్ సోకుతుండగా,  గర్భిణీతో ఉన్న మహిళలకు  కరోనా సోకితే డెలివరీ తరువాత పిల్లలకు వైరస్ సోకే అవకాశం ఉందని తెలిపారు.

అయితే గర్భంలో ఉండగా కరోనా సోకడం అరుదుగా జరుగుతుందని, అ విషయంపై వైద్యులకు పూర్తి స్థాయిలో అనుభవం అవసరం అంటూ  నియోనాటల్ క్రిటికల్ కేర్ మెడికల్ డైరెక్టర్ డేనియల్ డి లూకా  ది గార్డియన్‌తో చెప్పారు.

 కరోనా లక్షణాలే లేవు

సైంటిస్ట్ ల పరిశోధనల్లో 176 కేసులలో సగం మందికి కరోనా లక్షణాలు వెలుగులోకి రాలేదని తేలింది. కరోనా లక్షణాలున్న వారిలో  64 శాతం మందికి అసాధారణమైన  ఊపిరితిత్తుల సమస్యలు, 52 శాతం మందికి శ్వాస సంబంధిత సమస్యలు, 44 శాతం మందికి జ్వరం, మరియు 36 శాతం మందికి ఆహారం, విరేచనాలు మరియు వాంతులు వంటి ఇబ్బందులు ఉన్నాయని నివేదిక తెలిపింది.

తల్లి పాలిస్తే ప్రమాదం ఉందా..? 

నవజాత శిశువులకు తల్లిపాలు ఇవ్వడం వల్ల ప్రమాదం ఉంటుందా అన్న విషయంపై డాక్టర్ డేనియల్ డి లూకా మాట్లాడుతూ..  కరోనా అంటు వ్యాధి కాబట్టి..అప్పుడే పుట్టిన పసికందులకు కరోనా సోకే అవకాశం ఉందని, ఇది వేరుగా ఉంచిన దానికంటే ఐదురేట్లు ఎక్కువగా ఉందన్నారు. నవజాత శిశువుకు తల్లిపాలు చాలా మంచిది కానీ కరోనా వైరస్ నేపథ్యంలో తల్లి , పసికందుల్ని కొన్నిరోజులు విడిగా ఉంచడం మంచిదేనన్న అభిప్రాయాన్ని డాక్టర్ నియోనాటల్ క్రిటికల్ కేర్ మెడికల్ డైరెక్టర్ డేనియల్ వ్యక్తం చేశారు.

Latest Updates