తబ్లిగి లింక్ తోనే 30 శాతం కరోనా కేసులు

  • క్వారంటైన్లో 22 వేల మంది తబ్లిగి సభ్యులు, వారి కాంటాక్ట్
  • దేశంలో 24 గంటల్లో 12 మంది మృతి.. 91 చేరిన డెత్ లు
  •  3,500 చేరిన కేసులు.. కొత్తగా 600 పైగా నమోదు

 

దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో మర్కజ్ మసీదులో తబ్లిగి జమాత్ సమావేశాలకు హాజరైన వారివే 30 శాతం పైగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం 17 రాష్ర్టాల్లో నమోదైన 1,023 కొవిడ్ పాజిటివ్ కేసులు తబ్లిగితో లింక్ అయి ఉన్నా యని చెప్పింది. శనివారం ఈ మేరకు హెల్త్ మినిస్ట్రీ జాయింగ్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ మీడియాతో మా ట్లాడుతూ.. శుక్రవారం నుంచి కొత్తగా 600లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, మొత్తం కేసుల సంఖ్య 3500 దాటిందని తెలిపారు. ఇప్పటి వరకు 91 మంది చనిపోగా.. శుక్రవారం నుంచి శనివారం వరకు 24 గంటల్లో 12 మంది చనిపోయారన్నారు. 262 మంది రికవర్ లేదా డిశ్చార్జ్ అయ్యా రని చెప్పారు. కేరళ, మధ్యప్రదేశ్, ఢిల్లీ కి చెందిన 58 మంది- బాధితుల పరిస్థితి క్రిటికల్ గా ఉందని హెల్త్ మినిస్ర్టీ తెలిపింది. సుమారు 22 వేల మంది తబ్లిగి జమాత్ సభ్యులు, వారు కాంటాక్ట్ అయిన వ్యక్తులను దేశవ్యాప్తంగా క్వారంటైన్లో ఉంచినట్లుకేంద్ర హోం శాఖ చెప్పింది.ఆ యుష్మాన్ భారత్ లబ్ధిదారులకు ప్రైవేటు ల్యాబ్‌లు, ఎంప్యానెల్ ఆస్పత్రుల్లో కరోనా టెస్టులు, ట్రీట్‌మెంట్ ఫ్రీగా చేస్తారని నేషనల్ హెల్త్ అథారిటీ ప్రకటించింది.

ఇంట్లో తయారు చేసిన మాస్క్ లే వాడండి

కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతుండటంతో ఇండ్లలో తయారు చేసిన మాస్కులనే వాడాలని ప్రజలకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఎలాంటి అనారోగ్యం, శ్వాస సంబంధిత సమస్యలు లేని వారు ఇండ్ల నుంచి బయటికెళ్తే.. కచ్చితంగా హోం మేడ్ మాస్క్ లే యూజ్ చేయాలని కోరింది. వాటిని ప్రతి రోజు వాష్ చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు అడ్వైజరీ జారీ చేసింది. ఇంట్లో తయారు చేసుకున్న మాస్కుల వల్ల వైరస్ సోకే ముప్పు తక్కువగా ఉంటుందని చెప్పింది. అయితే కరోనా పేషెంట్లు, కరోనా పేషెంట్లకు ట్రీట్ చేస్తున్న డాక్టర్లు, నర్సులు, హెల్త్ వర్కర్లు మాత్రం ఈ మాస్కులు వాడకూడదని సూచించింది.

 రైళ్లు నడపడంపై ఇంకా నిర్ణయం తీసుకోలే

లాక్‌‌‌‌‌‌‌‌డౌన్ ముగిసిన తర్వాత రైలు సేవలను పునరుద్ధరించే అంశమై ఇంకా ఎలాంటి నిరయ్ణం తీసుకోలేదని రైల్వే శాఖ తెలిపింది. రైల్వే బోర్డు నుంచి ప్రతి ట్రైన్ కు అప్రూవల్ వచ్చిన తర్వాతే సర్వీసులు ప్రారంభిస్తామని తెలిపింది. మరోవైపు ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే ఈనెల 15 నుంచి అన్ని సర్వీసులు మళ్లీ ప్రారంభించేందుకు రైల్వే చర్యలు చేపడుతోంది. రైల్వే ఉద్యోగులంతా 15వ తేదీ నుంచి డ్యూటీకి హాజరయ్యేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలిచ్చింది.

 ఎంపవర్డ్ గ్రూపులతో మోడీ మీటింగ్

కరోనా వ్యాప్తినేపథ్యంలో ప్రధాని మోడీ శనివారం ఎంపవర్ గ్రూపులతో డ్ భేటీ అయ్యారు. పీపీఈలు, మాస్క్లు, గ్లౌవ్స్ సహా అన్ని రకాల మెడికల్ ఎక్వీప్ మెంట్నుఅవసరానికి అనుగుణంగా అందుబాటులో ఉంచాలని ఆధికారులను ఆదేశించారు.

ఎక్కడెక్కడ ఏం జరిగిందంటే..

ఎమర్జెన్సీ పరిస్థితి వస్తే ఐసోలేషన్ వార్డులు ఏర్పా టు చేసేందుకు యూపీలోని ముజఫర్ నగర్లో 21 హోటళ్లను ఆఫీసర్లు స్వాధీనం చేసుకున్నారు. లాక్డౌన్ ప్రోటోకాల్ ను ఉల్లంఘించి నందుకు కేరళలో 3 కేసులు నమోదయ్యాయి. మసీదుల్లో గుంపుగా ఉన్నందుకు కోజికోడ్, చవక్కడ్, పెరింగమాల ప్రాంతాల్లో 30 మందిని అరెస్టు చేశారు. సోషల్ డిస్టెన్సింగ్ రూల్స్ ను ఉల్లంఘించి కేరళలోని కొచ్చిలో మార్నింగ్ వాక్ వెళ్లిన 41 లి మందిని పోలీసులు డ్రోన్లసాయంతో పట్టుకున్నారు. ఢిల్లీలో ని ఓ వైన్ షాపులను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు లూటీ చేశారు. నార్త్ ఢిల్లీలోని రోష్ నార రోడ్లో షాపు తాళాలు పగులగొట్టి వెళ్లి లిక్కర్ బాటిళ్లు ఎత్తుకెళ్లారు. ఢిల్లీలో రోజూ 1.3 లక్షల ఫుడ్ ప్యాకెట్లను సంఘ్ వర్కర్లు సరఫరా చేస్తున్నట్లు ఆర్ఎస్ఎస్ ఢిల్లీ శాఖ తెలిపింది. రోజు కూలీలు, పేదలకు 47 వేల రేషన్ కిట్లు అందజేసినట్లు చెప్పింది. చత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్లో సెక్యూరిటీ ఫోర్సెస్.. నక్సల్స్ తో మాత్రమే ఫైట్ చేయడం లేదని, కరోనా వైరస్ తో పోరాడుతున్నారని అధికారులు అన్నారు. మహారాష్ర్టలో కరోనా కేసుల సంఖ్య 537కు చేరింది. శనివారం కొత్తగా 47 కొత్తకేసులు నమో దయ్యాయి. మొత్తంగా 26 మంది చనిపోయారు. ఒకవైపు క్వారంటైన్ ఫెసిలిటీస్ కోసం రైల్వే కోచ్ లను మారుస్తూనే… మరోవైపు తమ వర్క్ షాపులు, షెడ్లు, డిపోల్లో మాస్క్ లు, శానిటైజర్లు తయారు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే తెలిపింది. యూపీలోని బరేలీలో షాదన వాలీ దర్గాలో ఉన్న 200 మందిని పోలీసులు ఖాళీ చేయించారు. వా రందరినీ హోంక్వారంటైన్క్ కు తరలించారు. 3 ‘స్పెషల్ కొ విడ్’ ఆస్పత్రులు ప్రారంభించిన ఒడిశా ప్రభుత్వం.. పేషెంట్లకు చికిత్స అందిం చేందుకు 500 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్లకు ట్రైనింగ్ ఇస్తోంది. తగ్లిబీ జమాత్ సమావేశాలకు హాజరైన బంగ్లాదేశ్ కు చెందిన 12 మందిపై ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

డేంజర్ బెల్స్

దేశంలోని 30% జిల్లాలకు విస్తరణ

దేశంలోని 30 శాతం జిల్లాలను కరోనా మహమ్మారి కమ్మేసింది. సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ డేటా ప్రకారం.. దేశంలో ని మొత్తం 720 జిల్లాలకు 21 1 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొన్ని పెద్దరాష్ట్రాల్లో 60 శాతం జిల్లాలకు వైరస్ వ్యాపించింది. మరి కొన్ని రాష్ట్రాల్లో 30 శాతం జిల్లాలకు ఈ వైరస్ సోకింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 17 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో 20 కంటే ఎక్కువ జిల్లాల్లో, మరో 11 రాష్ట్రాల్లో 20 శాతం కంటే ఎక్కువ జిల్లాలు కరోనా ప్రభావానికి గురయ్యాయి. తమిళనాడులో జిల్లాలు 37 ఉంటే కరోనా బారిన పడిన వాటి సంఖ్య 23(62 శాతం), ఇక మహారాష్ట్రలో 36 జిల్లాలకు 19(52 శాతం) జిల్లాల్లో కరోని ఎఫెక్ట్ పడింది. కేరళ, ఢిల్లీలో మొత్తం అన్ని జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.

Latest Updates