కలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్థులకు అస్వస్థత

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మైనారిటీ గురుకులంలో కలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆహారం, నీళ్లు కలుషితం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలిపారు డాక్టర్లు. ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు.

రాత్రి మిగిలిన అన్నం పెట్టారని అది తినడంతో వాంతులు అయ్యాయని తెలిపారు స్టూడెంట్స్. అయితే గత నెలరోజుల్లో విద్యార్థులు అస్వస్థతకు గురికావడం ఇది రెండో సారి. గురుకులంలో తరుచూ ఇలాంటి ఘటనలు జరగడంతో  పేరేంట్స్ ఆందోళన చెందుతున్నారు.  ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

 

Latest Updates