గురుకులంలో కలుషిత ఆహారం తిని  30 మందికి అస్వస్థత

హైదరాబాద్‌లోని విజయనగర్‌ కాలనీలో ఉన్న మైనారిటీ గురుకుల పాఠశాలలో  విద్యార్దులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తినడంతో దాదాపు 30 మంది విద్యార్ధులకు వాంతులు, విరోచనాలు అయ్యాయి. దీంతో వారిని నీలోఫర్‌ ఆస్పత్రికి  తరలించి చికిత్స చేస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని.. కలుషిత ఆహారం తినడం వల్లే విద్యార్దులు అస్వస్థతకు గురయ్యారని నీలోఫర్‌ డాక్టర్లు తెలిపారు.

Latest Updates