కరోనా మందనుకొని తాగి 300 మంది మృతి

ఇరాన్‌‌‌‌లో మిథనాల్‌‌‌‌ తాగి 300 మంది మృతి కరోనాకు మందు మిథనాల్‌‌‌‌ అనుకొని తాగిన 300 మంది ఇరాన్‌‌‌‌ ప్రజలు మృతిచెందారు. వెయ్యి మందికి పైగా అనారోగ్యం పాలయ్యారు. కొందరికి కంటిచూపు కూడా పోయినట్టు తెలిసింది. కరోనాకు మందు మిథానాల్‌‌‌‌ అని ఫేక్‌‌‌‌ వార్తలను సోషల్‌‌‌‌ మీడియాలో చూసిన జనం దాన్ని తాగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. అయితే అక్కడి ఓ డాక్టర్ మాత్రం 480 మంది చనిపోయారని, 2,850 మంది అనారోగ్యం బారిన పడ్డారని తెలిపారు.

Latest Updates