బాలాకోట్​ దాడిలో 300 మంది టెర్రరిస్టులు చనిపోయిండ్రా?

300-terrorists-killed-in-balakot-attack-former-diplomat-of-pakistan-revealed

న్యూఢిల్లీ: బాలాకోట్​లో ఇండియన్​ ఎయిర్​ఫోర్స్(ఐఏఎఫ్) జరిపిన దాడిలో 300 మంది టెర్రరిస్టులు చనిపోయారని పాకిస్తాన్​ మాజీ డిప్లొమాట్​ ఒకరు తాజాగా వెల్లడించారు. ఐఏఎఫ్​ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అప్పుడు అబద్దం చెప్పామని ఒప్పుకున్నరు. ఇండియా జరిపిన సర్జికల్​ స్ట్రైక్​లో భారీ సంఖ్యలో టెర్రరిస్టులు చనిపోయినా మౌనంగా ఉండాల్సి వచ్చిందని పాకిస్తాన్​ మాజీ డిప్లొమాట్ ఆఘా హిలాలే చెప్పారు. టీవీ డిబేట్లలో తరచుగా పాల్గొనే హిలాలే.. పాక్​ ఆర్మీ తరఫున వకల్తా పుచ్చుకుని మాట్లాడతారు. తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 2019 ఫిబ్రవరి 26న ఐఏఎఫ్​ జరిపిన దాడిలో బాలాకోట్​లో తలదాచుకున్న టెర్రరిస్టులు 300 మంది చనిపోయారని చెప్పారు. ప్రాణనష్టం గురించి వెల్లడిస్తే టెర్రరిస్టులు ఉన్నారని ఒప్పుకున్నట్లు అవుతుందనే కారణంగానే అప్పుడు మౌనం వహించామన్నారు.

ఫ్యాక్ట్ చెక్… బాలాకోట్​ దాడిలో 300 మంది టెర్రరిస్టులు చనిపోయారన్న వార్తలో వాస్తవం లేదు
సవరణ :
నేషనల్ న్యూస్ ఏజెన్సీ నుంచి పై వార్త తీసుకోవడం జరిగింది. పాకిస్తాన్​ మాజీ డిప్లొమాట్ తను మాట్లాడిన వీడియో ని ఎడిట్ చేసి తప్పుగా రాశారని ట్వీట్ చేసారు . తర్వాత ANI కూడా ఆ వార్తని తొలగించటం జరిగింది .

 

Latest Updates