సిటిజన్​షిప్​కు అర్హులు 31,313

ఐబీ రికార్డుల ప్రకారం ఇండియాకు 
వలస వచ్చిన మైనార్టీలు వీరే 

న్యూఢిల్లీ: సిటిజన్​షిప్​చట్టం కింద వెంటనే లబ్ధి పొందే మైనార్టీలు 31,313 మంది అని ఇంటెలిజెన్స్​బ్యూరో (ఐబీ) చెప్పింది. వీరిలో 25,447 మంది హిందువులు, 5,807 మంది సిక్కులు, 55 మంది క్రిస్టియన్లు, ఇద్దరు బుద్ధిస్టులు, ఇద్దరు పార్శీలు ఉన్నారని పేర్కొంది. 2016లో పార్లమెంటరీ కమిటీకి అందజేసిన రిపోర్టులో ఈ మేరకు వెల్లడించింది. మోదీ ప్రభుత్వం 2016లో సిటిజన్​షిప్​అమెండమెంట్​బిల్లు తీసుకొచ్చినప్పుడు పార్లమెంటరీ కమిటీ పలు ప్రశ్నలు అడగ్గా ఐబీ సమాధానాలిచ్చింది. ఈ చట్టం కింద ఎంత మందికి లబ్ధి చేకూరుతుందని కమిటీ ప్రశ్నించగా ‘‘మా రికార్డుల ప్రకారం 31,313 మంది మైనారిటీలు మతపరమైన హింసకు గురై భారత్​లో ఆశ్రయం పొందుతున్నారు. వారందరూ ఇండియన్​ సిటిజన్​షిప్​కోరుకుంటున్నారు. ఈ చట్టం కింద వీరందరికీ వెంటనే ప్రయోజనం చేకూరుతుంది” అని ఐబీ బదులిచ్చింది.

‘‘ఇండియాకు వచ్చిన సమయంలోనే వలసదారులు ఎవరైతే తాము మతపరమైన హింసకు గురై ఇక్కడికి వచ్చామని చెప్పారో వారే ఈ చట్టం కింద సిటిజన్​షిప్​ పొందేందుకు అర్హులు. ఈ కారణాలను చూపకుండా వలసదారులు సిటిజన్​షిప్​కోసం అప్లై చేసుకుంటే… తాము మతపరమైన హింస కారణంగానే భారత్​కు వచ్చామని నిరూపించాల్సి ఉంటుంది. దీనిపై రీసెర్చ్​అండ్​ అనాలిసిస్​వింగ్(రా) ​ఎంక్వైరీ చేస్తుంది” అని చెప్పింది.  ‘‘మేం రిపోర్టులో పేర్కొన్న 31,313 మంది తాము మతపరమైన హింస కారణంగానే వచ్చామని ముందే చెప్పారు. వీరిలో కొంతమంది ఇప్పటికే వివిధ రూపాల్లో సిటిజన్​షిప్​తీసుకున్నారు ” అని ఐబీ వివరించింది.

Latest Updates