దేశంలో 4 కోట్ల టెస్టులు..34 లక్షలు దాటిన కేసులు

దేశంలో కరోనా విలయ తాండవం చేస్తుంది. గత మూడు రోజులుగా ప్రతి రోజు 70 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.  నిన్న ఒక్కరోజే  దేశ వ్యాప్తంగా 76,472 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 34,63,973కు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 1021 మంది చనిపోవడంతో కరోనా మరణాల సంఖ్య 62,550కు చేరింది. 26,48,999 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 7,52,424 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

నిన్న ఒక్కరోజే 9,28,761 మందికి టెస్టులు చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా ఆగస్టు 28 వరకు కరోనా టెస్టుల సంఖ్య మొత్తం 4,04,066,09 కు చేరింది.

Latest Updates