35 ఏళ్ల పోరాటం.. ఐర్లాండ్‌లో అబార్షన్‌ చట్టబద్ధం

ఐర్లాండ్ దేశంలో అబార్షన్ చేయడానికి చట్టబద్దత లభించింది. ఇందుకు అక్కడి మహిళలు 35 ఏళ్లుగా పోరాడారు. అబార్షన్ కోసం దేశం వదిలి బ్రిటన్ కు వెళ్లాల్సిన దుస్తితి లో ఐర్లాండ్ మహిళలు ఉండేవారు. గర్భంతో ఉన్న మహిళల ఆరోగ్యం క్షిణించినా.. ప్రాణాలు పోయే పరిస్తితి ఉన్నా ఆ దేశం లో అబార్షన్ చేసేవారుకాదు.. దీంతో అక్కడి మహిళలు ప్రాణాలు కోల్పోయేవారు.

భారత్‌కు చెందిన సవిత హలప్పన్వర్‌ స్వతహాగా డాక్టర్. 2012 వ సంవత్సరంలో గర్బం దాల్చింది. కొన్ని కారణాల వల్ల ఆమె రక్తం విషతుల్యం అయింది. దీంతో తీవ్ర కడుపునొప్పి రావడంతో అక్కడి హాస్పిటల్ లో చేరింది. తనకు అబార్షన్ చేస్తే బతుకుతానని దయచేసి అబార్షన్ చేయమని వేడుకుంది. అయినా అక్కడి డాక్టర్ లు కరుణించలేదు. నిబంధనలు ఒప్పుకోవని తెలిపారు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. అప్పుడు ఆమె వయస్సు 31. ఈ ఘటన ఐర్లాండ్ తో పాటు భారత్ లో కూడా చర్చకు దారి తీసింది.

కదిలిన ఐర్లాండ్ ప్రభుత్వం :
మహిళలు చేసిన ఉద్యమానికి ఐర్లాండ్ ప్రభుత్వం దిగి వచ్చింది. అబార్షన్‌ మీద నిషేధం ఎత్తివేయాలంటూ మేలో రిఫరెండం ప్రవేశ పెట్టింది. దీనికి 66 శాతం మంది ప్రజలు మద్దతు తెలిపారు. అక్కడి  మహిళలను ఉద్ధేశించి ఐర్లాండ్ ప్రధాని ట్వీట్ చేశారు. ‘ఐర్లాండ్ మహిళలకు ఇది చరిత్రాత్మక సమయం. దీనికి మద్దతు తెలిపిన వారందరికి కృతజ్ఞతలు’ అని తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.

Posted in Uncategorized

Latest Updates