35కు పెరిగిన ఢిల్లీ అల్లర్ల మృతుల సంఖ్య

ఢిల్లీలో చెలరేగిన అల్లర్లలో మరణించిన వారి సంఖ్య గురువారం నాటికి 35 కి పెరిగింది. సీఏఏ అనుకూల‌, వ్య‌తిరేక వ‌ర్గాల మ‌ధ్య జరిగిన ఘ‌ర్ష‌ణల కారణంగా.. గురు తేగ్ బహదూర్ (జిటిబి) ఆసుపత్రిలో 30, ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రిలో రెండు, జగ్ పర్వేశ్ చంద్ర ఆసుపత్రిలో ఒకరు మరణించినట్లు జిటిబి ఆసుపత్రి అధికారులు తెలిపారు. ఈ  ఘర్షణల్లో ఢిల్లీ పోలీసు హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్, ఇంటెలిజెన్స్ బ్యూరో కానిస్టేబుల్ కూడా మృతి చెందారు. దీంతో బుధవారం నాటికి మరణించిన వారి సంఖ్య 27 ఉండగా.. తాజాగా అది 35 కు పెరిగింది.

మరణించిన వారిలో కొంతమంది వివరాలను జిటిబి ఆసుపత్రి అధికారులు వెల్లడించారు. జిటిబి హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. మృతుల్లో చాలా మందిని గుర్తించామని.. మరికొందరి ఆచూకీ తెలియాల్సి ఉందని చెప్పారు. రోగుల్లో చాలా మందికి తుపాకీ కాల్పులు, రాళ్ళు మరియు ఇతర ఆయుధాల గాయాలు ఉన్నాయి.. అల్లర్ల నుండి తప్పించుకునే క్రమంలో చాలా మంది పైకప్పుల నుండి దూకి గాయపడ్డారని ఆసుపత్రి అధికారులు తెలిపారు.

35-dead-names-of-19-people-killed-in-delhi-riots-confirmed

Latest Updates