సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం. 35 మంది మృతి

మదీనా: సౌదీ అరేబియాలోని మదీనా ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అల్ అఖల్ సెంటర్‌ వద్ద ప్రయాణీకులతో వెళుతున్న ఓ బస్సు భారీ వాహనాన్ని ఢీకొట్టడంతో 35 మంది మరణించారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రయాణీకులలో ఆసియా, అరబిక్ జాతీయులు ఉన్నారని ప్రావిన్స్‌ పోలీస్ అధికారి ఒకరు అన్నారు. గాయపడిన వారిని క్షతగాత్రులను అల్ హమ్నా ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Latest Updates