ఏపీలో కొత్తగా 3503 కరోనా కేసులు.. 24 మంది మృతి

ఏపీలో కొత్తగా మరో 3503 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 69,095 టెస్టులు చేయగా ఈ కేసులు వచ్చాయి. సోమవారం ఉదయం 9 నుంచి మంగళవారం ఉదయం 9 గంటల మధ్య రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా సంఖ్య 7,89,553కు చేరింది. అందులో 7,49,676 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 5,144 మంది కోలుకున్నారు. ఏపీలో ఇప్పటి వరకు 6,481 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 24 మంది మరణించారు. అయితే ప్రస్తుతం కరోనా రికవరీ రేటు బాగా పెరుగుతోందని, రోజు రోజుకీ యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతోందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ వ్యాప్తి కూడా కంట్రోల్‌లోకి వచ్చిందని పేర్కొంది. ఇప్పటి వరకు 7,49,676 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 33,396గా ఉందని తెలిపింది.

జిల్లాలవారీగా కరోనా కేసుల సంఖ్య

Latest Updates