రాజ్ భవన్లో ఎట్ హోం..హాజరైన కేసీఆర్, మంత్రులు

రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్ భవన్ లో తేనీటి విందు ఇచ్చారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై. కార్యక్రమానికి అన్ని పార్టీల ముఖ్య నేతలతో పాటు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ , సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమానికి వచ్చిన వారిని పేరు పేరున పలకరించారు గవర్నర్.