భారత్ లో రైతుల ఆందోళన..మద్దతు పలికిన 36మంది యూకే ఎంపీలు

భారత్‌లో జరుగుతున్న రైతుల ఆందోళనలకు బ్రిటీష్‌ ఎంపీలు మద్దతు పలికారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బ్రిటన్‌ విదేశాంగ కార్యదర్శి డొమినిక్‌ రాబ్‌కు వివిధ పార్టీలకు చెందిన 36 మంది ఎంపీలు  లేఖ రాశారు. వారిలో భారత్ మూలాలున్న ఎంపీలు ఉన్నట్లు తెలుస్తోంది.  లేబర్‌ పార్టీ మాజీ నేత జెర్మీ కార్బిన్‌తో పాటు వీరేంద్ర శర్మ, సీమా మల్హోత్రా, వెలిరీ వాజ్‌, నడియా విట్టమ్‌, పీటర్‌ బాటమ్లి, మార్టిన్‌ డాకర్టి, జాన్‌ మెక్‌డొనాల్డ్‌, అలిసన్‌ థెవిల్స్‌ తదితరులు రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుతూ ఈ లేఖ రాశారు.
బ్రిటన్‌లో నివసిస్తున్న చాలా మంది సిక్కులు, పంజాబీలు ఈ అంశాన్ని ఆయా ప్రాంతాల ఎంపీల దృష్టికి తీసుకువచ్చారని లేఖలో పేర్కొన్నారు.  కాగా భారత్‌లో ఆమోదం పొందిన మూడు నూతన వ్యవసాయ చట్టాల ప్రభావం గురించి ఇటీవల అనేక మంది బ్రిటీష్‌ ఎంపీలు భారత హై కమిషన్‌కు లేఖ రాశారని వెల్లడించారు. కాగా, భారత్‌లో జరుగుతున్న రైతు ఆందోళనలపై బ్రిటీష్‌ ఎంపీలు సోషల్‌ మీడియా ద్వారా స్పందిస్తున్నారు.

Latest Updates