24 గంటల్లో 37,148 పాజిటివ్ కేసులు

కరోనా కేసులు రోజురోజుకూ దేశ వ్యాప్తంగా పెరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 37,148 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 587 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11,55,191కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 4,02,529 కేసులు యాక్టివ్‌గా ఉండగా.. 7,24,578 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 28,084 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో కరోనా విషయంలో మహారాష్ట్ర పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ ఇప్పటివరకు అత్యధికంగా 3,18,695 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాగా, 12,030 మంది కరోనా బారినపడి చనిపోయారు. ఆ తర్వాత తమిళనాడులో 1,75,678 కేసులతో రెండో స్థానంలో ఉంది. ఢిల్లీలో 1,23,747 కేసులతో మూడో స్థానంలో ఉంది.

For More News..

టెస్టు చేయకుండానే కరోనా పాజిటివ్ గా తేల్చిన వైద్య సిబ్బంది!

మద్యం దుకాణాలు, బ్యాంకులు కూడా మూయాల్సిందే

పోలీస్ స్టేషన్ ముందు యువకుడి ఆత్మాహత్యాయత్నం

Latest Updates