భారత్ లో 18 వేలు దాటిన కరోనా మరణాలు

భారత్ లో కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతోంది. గత 24 గంటల్లో 20,903 కరోనా కేసులు నమోదవ్వగా 379 మంది చనిపోయారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 6,25,544 కు చేరగా మృతుల సంఖ్య 18,213 కు చేరింది. 3,79,892 మంది డిశ్చార్జ్ కాగా  2,27,439 మంది చికిత్స పొందుతున్నారు.  జూలై 2న 241576 మందికి కరోనా టెస్టులు చేశారు. భారత్ లో   జూలై 2 వరకు మొత్తం 92,97,749 మందికి కరోనా టెస్టులు చేశారు. ఇక అత్యధికంగా మహారాష్ట్రలో 1,86,626 కరోనా కేసులు నమోదవ్వగా 8178 మంది చనిపోయారు.

Latest Updates