బుల్లెట్ బంతుల బుమ్రా : 39 ఏళ్ల రికార్డ్ బ్రేక్

మెల్ బోర్న్ : టీమిండియా బౌల‌ర్ జస్ ప్రీత్ బుమ్రా సరికొత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు.  టెస్ట్ ఫార్మాట్‌ లోకి అరంగేట్రం చేసిన తొలి ఏడాదిలో అత్య‌ధిక వికెట్లు ప‌డ‌గొట్టిన భార‌త బౌల‌ర్‌ గా నిలిచాడు. 39 ఏళ్ల కింద నమోదైన రికార్డును బ‌ద్ద‌లుగొట్టాడు. ఈ ఏడాది సౌతాఫ్రికా టూర్ తో టెస్ట్‌ ల్లోకి ఎంట్రీ ఇచ్చిన బుమ్రా.. ఇప్ప‌టివ‌ర‌కు 9 మ్యాచ్‌ లు ఆడి 45 వికెట్లు తీశాడు. ఆ ఘ‌న‌త సాధించిన ఫస్ట్ భార‌త బౌల‌ర్‌ గా రికార్డ్ లో నిలిచాడు.

ఇప్ప‌టివ‌ర‌కు ఈ రికార్డు మాజీ స్పిన్ బౌల‌ర్ దిలీప్ దోషి పేరు మీద ఉంది. 1979లో టెస్ట్ అరంగేట్రం చేసిన దిలీప్ ఆ ఏడాది మొత్తం 40 వికెట్ల‌ను తన ఖాతాలో వేసుకుని రికార్డు సృష్టించాడు. 39 ఏళ్ల త‌ర్వాత బుమ్రా ఆ రికార్డును బ్రేక్ చేశాడు.  బుమ్రా, దిలీప్ త‌ర్వాతి స్థానాల్లో వెంక‌టేష్ ప్ర‌సాద్ (1996- 37 వికెట్లు), న‌రేంద్ర హిర్వాణీ (1988- 36 వికెట్లు), శ్రీశాంత్ (2006 – 35 వికెట్లు) ఉన్నారు.  ప్ర‌స్తుతం మెల్‌ బోర్న్‌ లో జ‌రుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌ లో ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్‌ లో బుమ్రా 6 వికెట్లు తీశాడు. ఈ ఏడాదే టెస్ట్ కెరీర్ ప్రారంభించిన బుమ్రా ఇప్ప‌టివ‌ర‌కు 5 లేదా.. అంత‌కంటే ఎక్కువ వికెట్ల‌ను మూడు సార్లు సాధించాడు.

Posted in Uncategorized

Latest Updates